calender_icon.png 27 February, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబర్‌పేట ఫ్లుఓవర్‌పై ప్రయాణం షురూ

27-02-2025 12:28:23 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవ రి 26 (విజయక్రాంతి): ఏళ్లుగా నిరీక్షిస్తున్న అంబర్‌పేట్ ప్లుఓవర్ వాహన దారులకు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. అంబర్‌పేట్ ప్లుఓవర్ పనులు పూర్తయి.. సర్వీస్ రోడ్ పను లు ఇంకా మిగిలి ఉండగానే వాహన దారుల ఇక్కట్లను దృష్టిలో పెట్టుకుని అధికారికంగా ప్రారంభం కాకున్నా బుధవారం నుంచి వాహనాల రాకపోకలకు అనుమతించారు. ఛేనంబర్ మీదుగా గోల్నాక నుంచి అంబర్‌పేట దాకా ఫ్లుఓవర్‌పై ఉప్పల్, అటు ఎంజీబీఎస్ దాకా వాహనాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. ఫ్లుఓవర్ కిందనున్న సర్వీస్ రోడ్లు, గ్రీనరీ తదితర పెండింగ్ పనులకు భూసేకరణ ఇంకా చేయాల్సి ఉండటంతో  కిషన్‌రెడ్డి వా హనదారులకు ముందుగా ఫ్లుఓవర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.