సూపర్ రాజా రచనాదర్శ త్వం, నిర్మాణంలో వస్తున్న సరికొ త్త చిత్రం ‘ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు’. రాజాకృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సిద్ధార్థ్ శివదా సని, సబు వర్గీస్ సంగీతం సమకూర్చుతున్నారు. ఫిబ్రవరిలో సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో సూపర్ రాజా మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను ఎంతో కసితో, ప్యాషన్‌తో తెరకెక్కించాం. సినిమా అంతా సింగిల్ షాట్లో షూట్ చేశాం’ అని తెలిపారు. ‘ఈ సినిమాలో నేను సాయిపల్లవి క్యారెక్టర్‌లో నటించాను’ అని హీరోయిన్ చందన పాలంకి తెలిపారు. కార్యక్రమంలో నటులు వంశీ గోనె, రమ్యప్రియ, చిత్రబృందం పాల్గొన్నారు.