calender_icon.png 5 February, 2025 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇలాంటి కథ ఎప్పుడూ వినలేదు

21-01-2025 01:39:42 AM

టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఐడెంటిటీ’. ఈ సినిమాకు అఖిల్ పాల్, అనాస్ ఖాన్‌ల ద్వయం దర్శకత్వం వహించింది. వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలక పాత్ర పోషించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మామిడాల శ్రీనివాస్, చింతపల్లి రామారావు తెలుగులో విడుదల చేయనున్నారు.

ఈ నెల 24న రిలీజ్ కానుంది. సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాతలు శ్రీనివాస్, రామారావు మాట్లాడుతూ... “ఈ చిత్రంలో మన తెలుగువారు కోరుకునే యాక్షన్ కంటెంట్ చాలా బాగుం టుంది. ఈ సినిమాకు పనిచేసిన వారు తెలుగువాళ్లకు సుపరిచితులే” అన్నారు.

నటుడు వినయ్ రాయ్ మాట్లాడుతూ... “తెలుగులో ప్రశాంత్ వర్మ నన్ను ప్రేక్షకులందరికీ ఎంతగా గుర్తుండిపోయేలా చేశారో.. మలయాళంలో అఖిల్ ఆ స్థాయిలో నాకు గుర్తింపు వచ్చేలా చేశారు. నా 18 సంవత్సరాల కెరియర్‌లో ఇటువంటి కథను నేను ఎప్పుడు వినలేదు” అని తెలిపారు.