calender_icon.png 21 January, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాఫ్.. తగ్గేదేలే

30-08-2024 12:00:00 AM

ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్‌లో సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ 25 గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా సాగుతున్నాడు. రెండో రౌండ్‌లో సునాయాస విజయం సాధించిన జొకో మూడో రౌండ్‌లో అడుగుపెట్టగా.. నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ కూడా ముందంజ వేశాడు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ కోకో గాఫ్ రెండో రౌండ్‌లో అలవోక విజయం సాధించగా.. ప్రపంచ రెండో ర్యాంకర్ అరీనా సబలెంకా ఎలాంటి అడ్డంకి లేకుండా మూడో రౌండ్‌లో అడుగుపెట్టగా.. 8వ ర్యాంకర్ స్వితోలినాకు ఊహించని షాక్ ఎదురైంది.

న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో అమె రికా సంచలనం కోకో గాఫ్ మూడో రౌండ్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా రెండో రౌండ్‌లో గాఫ్ 6 6 తేడాతో మారియా (జర్మనీ) మీద సునాయస విజయం సాధించింది. మారియా ఐదు ఏస్‌లు కొట్టగా.. గాఫ్ 25 విన్నర్లు సంధించి తన ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక 17 అనవసర తప్పిదాలతో మారియా మూల్యం చెల్లించుకుంది.

మరో మ్యాచ్‌లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6-3, 6-1 తేడాతో బ్రాంజెట్టి (ఇటలీ) మీద సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సబలెంకా ఐదు ఏస్‌లతో పాటు 24 విన్నర్లు సంధించింది. 11 అనవసర తప్పిదాలతో బ్రాంజెట్టి ఓటమిని మూటగట్టుకుంది. మిగిలిన మ్యాచ్‌ల్లో స్వితోలినా (ఉక్రెయిన్) 6-1, 6-2 తేడాతో కాలినినా (ఉక్రెయిన్)పై, వెకిక్ (క్రొయేషియా) 7-5, 6-1 తేడాతో మిన్నెన్ (బెల్జియం)పై విజయాలు అందుకున్నారు. ఇక ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ క్రెజికోవా (చెక్ రిపబ్లిక్)కు ఊహించని షాక్ ఎదురైంది. రెండో రౌండ్‌లో క్రెజికోవా 4-6, 5-7తో 122వ ర్యాంకర్ రూస్  చేతిలో దారుణ ఓటమి చవిచూసింది. 

జొకోవిచ్ జోరు..

పురుషుల విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన జొకో మూడో రౌండ్‌లో అడుగుపెట్టాడు. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో జొకోవిచ్ (సెర్బియా) 6 6 2 తేడాతో డిజేరే (సెర్బియా) మీద విజయం సాధించాడు. రెండు గంటలకు పైగా సాగిన ఈ మ్యాచ్‌లో డిజేరే తొలి రెండు సెట్లలో పోటీనిచ్చినా కానీ మూడో సెట్లో మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. మ్యాచ్‌లో 18 విన్నర్లు సంధించిన జొకో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ జ్వెరేవ్ (జర్మనీ) 6 7 (7/5), 6 తేడాతో ముల్లర్ (ఫ్రాన్స్) మీద విజయదుందుభి మోగించి మూడో రౌండ్‌లో అడుగుపెట్టాడు.

15 ఏస్‌లతో మ్యాచ్‌లో జ్వెరెవ్ పట్టు నిలుపుకోగా.. 41 అవవరస తప్పిదాలతో ముల్లర్ మూల్యం చెల్లించుకున్నాడు. ఇక మిగిలిన మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ కాస్పర్ రుడ్ (నార్వే),  దిమిత్రోవ్ (బల్గేరియా)లు, ఆరో సీడ్  ఆండీ రుబ్లెవ్ (రష్యా)లు విజయాలతో ముందంజ వేశారు. డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన యూకీ బాంబ్రీ, శ్రీరామ్ బాలాజీలు రెండో రౌండ్‌కు చేరుకున్నారు. శ్రీరామ్ బాలాజీ ఆండ్రీయోజీ (అర్జెంటీనా) ద్వయం 5 6 7 (12/16)తో మార్కస్ (న్యూజిలాండ్) మిగుల్ (మెక్సికో) జంటపై విజయం సాధించగా.. యూకీ బాంబ్రీ ఒలివెట్టి (ఫ్రాన్స్) జంట 6 6 అమెరికా ద్వయం సెగ్గెర్‌మన్‌ొోహక్ జోడీని ఓడించింది.