calender_icon.png 5 October, 2024 | 2:44 AM

తటస్థంగా అరబ్ దేశాలు

05-10-2024 12:50:38 AM

  1. దోహా సమావేశంలో గల్ఫ్ దేశాల నిర్ణయం
  2. యుద్ధాన్ని నివారించాలని ఇరాన్‌కు సూచన

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడితో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ అంశంలో మధ్యప్రాచ్యంలో పలుకుబడి చె లాయించే అరబ్ దేశాలు మాత్రం తటస్థం గా ఉంటున్నట్లు పేర్కొన్నాయి. ఇటీవల ఖతార్ రాజధాని దోహాలో జరిగిన సమావేశంలో ఆయా దేశాలు తమ అభిప్రా యాలు వెల్లడించాయి.

గల్ఫ్ ప్రాంతంలో చమురు కేం ద్రాలపై దాడి చేస్తామని ఇరాన్ నుంచి ఎలాంటి బెదిరింపులు చేయలేదు. కానీ ఇజ్రాయెల్‌కు మద్దతుగా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటే వారి ప్రయోజనాలను టార్గెట్ చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో అరబ్ దేశాలు మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.

గల్ఫ్‌లోని చమురు కేంద్రాలపై ఇరాన్ ఎటువంటి దాడులు జరపదని భావిస్తున్నట్లు సౌదీ అరేబియా అభిప్రాయపడుతోంది. యుద్ధాన్ని తీవ్రతరం చేయొద్దని యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒ మన్, ఖతార్, కువైట్ సభ్యదేశాలుగా ఉన్న గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ ఇరాన్‌ను కోరిం ది. మంగళవారం దాడుల తర్వాత తమ చ ర్య ముగిసిందని ఇరాన్ సైతం ప్రకటించింది. 

హమాస్‌తో యుద్ధంలోనూ..

చమురు ఎగుమతుల్లో టాప్‌లో ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య కొన్నేళ్లుగా వివాదాలు ఉన్నాయి. వీటి కి గతేడాది ముగింపు లభించిన విష యం తెలిసిందే. చైనా మధ్యవర్తిత్వం తో రెండు దేశాల మధ్య ఒప్పం దం కుదిరింది.

అందుకే ఇజ్రాయెల్, హ మాస్ యుద్ధం సమయంలోనూ అర బ్ దేశాల్లో కీలకంగా వ్యవహరించే సౌ దీ అరేబియా ఎవరి పక్షం వహించకుండా తట స్థంగా వ్యవహరించింది. అనంతరం కొన్ని పరిస్థితుల నేపథ్యం లో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణల్లోనూ అరబ్ దేశాలు తటస్థంగా ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం.