హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల ప్రజలకు న్యూరో సంబంధిత రంగంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ‘రెనోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ సెన్సైస్’ (రిన్స్) రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రారంభించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో రెనోవా సెంచురీ హాస్పిటల్‌లో న్యూరో బ్లాక్‌ను నిమ్స్ మాజీ డైరెక్టర్ డీ రాజారెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యాధునిక న్యూరో సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో.. ప్రపంచ దేశాలలో కంటే అత్యుత్తమ వైద్య సదుపాయాలు ఉన్నాయన్నారు. రెనోవా హాస్పిటల్స్ ఎండీ, సీఈవో డా. శ్రీధర్ పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. నాడీ చికిత్సల్లో అవసరమైన అన్ని వైద్యసేవలను ఒకేచోట అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.
న్యూరాలజీ చీఫ్ డా. జేఎంకే మూర్తి, రెనోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ సెన్సైస్ బ్రౌచర్‌ను ఆవిష్కరించారు. డా.బీకేఎస్.శాస్త్రి, డా.వై మురళీధర్ రెడ్డి, డా. టీవీ రామకృష్ణమూర్తి, డా. అమీర్ బాషా, డా. లలిత పిడపర్తి, డా.శుభేందు, డా. అభినయ్ కుమార్ గట్టు తదితరులు పాల్గొన్నారు.