calender_icon.png 27 December, 2024 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఆర్‌సీటీసీ సేవలపై నెటిజన్ల ట్రోల్

27-12-2024 01:37:27 AM

  • నిలిచిపోయిన టికెట్ బుకింగ్ సేవలు
  • కొన్ని గంటల తర్వాత తిరిగి అందుబాటులోకి

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: భారతీయ రైల్వేకు సంబంధించిన ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫాం సేవలు గురువారం కొన్ని గంటల వరకూ నిలిచిపోయాయి. దీంతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(ఐఆర్‌సీటీసీ) వెబ్‌సైట్, యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్లాట్‌ఫాం దగ్గరు వెళ్లి టికెట్లను బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సెలవులపై ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఐఆర్‌సీటీసీ సేవలు నిలిచిపోవడం ఈ నెలలో ఇది రెండోసారి కావడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు ఐఆర్‌సీటీసీపై ట్రోల్ చేశారు. అయితే మెయింటెనెన్స్‌కు సంబంధించిన కార్యకలాపాల వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని అధికారులు పేర్కొన్నారు. కొంత సమయం తర్వాత సేవలను తిరిగి పునరుద్ధరించినట్టు వెల్లడించారు.