- టర్కీపై గ్రాండ్ విక్టరీ
- యూరో చాంపియన్‌షిప్
బెర్లిన్: యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో నెదర్లాండ్స్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ 2 టర్కీని చిత్తుచేసి ముందంజ వేసింది. నెదర్లాండ్స్ తరఫున స్టీఫెన్ డి వ్రిజ్ (70వ నిమిషంలో), మెర్ట్ ముల్డర్ (76వ ని.లో) ఒక్కో గోల్ చేయగా.. టర్కీ తరఫున సమిత్ అకాయ్‌దీన్ (35వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు. మరో క్వార్టర్ ఫైనల్ పోరులో స్విట్జర్లాండ్‌పై షూటౌట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది. బుధవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో స్పెయిన్‌తో ఫ్రాన్స్, గురువారం జరనున్న రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో నెదర్లాండ్స్ తలపడనున్నాయి.