calender_icon.png 25 November, 2024 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్‌లో ముగిసిన నెట్ బాల్ పోటీలు

11-11-2024 01:57:15 AM

నిర్మల్, నవంబర్ 10 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్‌టీఆర్ స్టేడియంలో మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని వివి ధ జిల్లాలకు చెందిన బాల, బాలికల జట్లు హాజరయ్యాయి. ఆదివారం ఫైనల్ పోటీలు నిర్వహించగా బాలికల విభాగంలో నల్లగొండ జట్టు విజయం సాధించగా.. ద్వితీయ స్థానంలో మహబూబ్‌నగర్ జట్టు నిలిచింది. బాలుర విభాగంలో మహబూబ్‌నగర్ ప్రథమ స్థానంలో నిలవగా నారాయణపేట ద్వితీయ స్థానంలో నిలిచింది. క్రీడాకారులకు  నెట్‌బాల్ అసోషియేసన్ రాష్ట్ర అధ్యక్షుడు విక్రమాదిత్యరెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు అంజికు మార్‌రెడ్డి, అవినాష్ వేదవ్యాస్, మొహాన్ అనిల్‌కుమార్, కిశోర్, భోజన్న పాల్గొన్నారు.

హ్యాండ్‌బాల్ పోటీల్లో ఆదిలాబాద్ జట్టు విజయం

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గత మూడు రోజులుగా అండర్ విభాగంలో రాష్ట్రస్థాయి హ్యాండ్‌పోటీలు జరిగాయి. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వరంగల్ జట్టుపై ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు విజయం సాధించింది. జట్టు కోచ్‌లు అరవింద్, సాయి, స్పూర్తి, వివేక్‌తో పాటు క్రీడాకారులను ఉమ్మడి జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు, హ్యాండ్‌బాల్ ఉమ్మడి జిల్లా అసోసియోషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోనే శ్యామ్ సుందర్‌రావు, కనపర్తి రమేష్, ఒలిపింక్ జిల్లా కార్యదర్శి రాఘునాథ్‌రెడ్డి, గిరిజనశాఖ డీడీ రమాదేవి, స్పోర్ట్స్ అధికారి మీనారెడ్డి అభినందించారు.