calender_icon.png 26 November, 2024 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెతన్యాహును ఉరితీయాలి

26-11-2024 01:31:48 AM

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ

టెహరాన్, నవంబర్ 25: గాజా,  లెబనాన్‌లో హింసకు బాధ్యులుగా పేర్కొంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గ్యాలెం ట్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయ తొల్లా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహును అరెస్ట్ చేస్తే సరిపోదని, ఉరి తీయాలని ఐసీసీకి సూచించారు.

అయితే ఖమేనీ వ్యాఖ్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సోమవారం బసిజ్ పారామిలిటరీ ఫోర్స్‌ను ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ గాజా, లెబనాన్‌లో  ప్రజలపై బాంబులు వేసి వారు ఎన్నటికీ విజయం సాధించబోరని అన్నారు. వాళ్లు చేస్తున్న నేరానికి అరెస్ట్ ఒక్కటే సరిపోదని, మరణశిక్ష విధించాలని సూచించారు. అయితే ఐసీసీ జారీ చేసిన వారెంట్‌ను పశ్చిమదేశాలు తిరస్కరించాయి.