కుదిపేస్తున్న గాజా కీలక దస్త్రాల లీకేజీ వ్యవహారం
న్యూఢిల్లీ, నవంబర్ 5: గాజా కీలక దస్త్రాల లీకేజీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఇజ్రా యెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సన్నిహితుడు ఎలియేజర్ ఫెల్డ్ స్టెయిన్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు మీడియా పేర్కొంది. కానీ భద్రతకు సంబంధించిన చర్చల్లో ఫెల్డ్‌స్టెయిన్ ఎప్పుడూ పాల్గొనలేదని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
ఈ లీకేజీని హాస్యాస్పదంగా అభివర్ణించింది. గాజాలోని తమ బందీలను ఈజిప్ట్ సరిహద్దు నుంచి అక్రమంగా తరలించాలని హమాస్ మిలిటెంట్ గ్రూప్ ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని కార్యాలయం ఆరోపించింది. గతేడాది ప్రారంభమైన యుద్ధం ఇరు దేశాల మధ్య ఇప్పటికీ కొనసాగుతోంది.