బీజేపీ రాష్ట్ర నేత రతంగ్
నారాయణపేట జనవరి 23 : (విజయ క్రాంతి): స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలనీ బీజేపీ రాష్ట్ర నేత కే. రతంగ్ పాండు రెడ్డి అన్నారు. గురువారం నారాయణపేట పట్టణం సుభా ష్ రోడ్డులో గల నేతాజీ సుభాష్ చంద్రబోస్ వద్ద భారతీయ జనతా పార్టీ నగర అధ్య క్షుడు పోశల్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పరాక్రమ దివస్‌ను ఘనంగా నిర్వహిం చారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేత రటంగ్ పాండు రెడ్డి, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు సత్య యాదవ్, పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్ మాట్లాడుతూ అహింసా, సాయుధ పోరాటాల రెండు రకాలుగా స్వరాజ్యసిద్ధి కోసం పోరాడిన ఒకే ఒక్క వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని సేవలను కొనియాడారు.
అలాగే కాంగ్రెస్ పార్టీకి రెండుసార్లు అధ్యక్షులుగా చేసి గాంధీజీతో అభిప్రాయ భేదం రావడం వల్ల స్వాతంత్రం ఒక్క శాంతియుగ మార్గం తోనే రాదని సాయుధ పోరాటమే మార్గమని గుర్తించి ఆజాద్ హింద్ ఫౌజ్ సంస్థను స్థాపించి మనకు స్వాతంత్రం రావడంలో ప్రత్యేక స్థానాన్ని మన భారతీయుల గుండెల్లో ఎప్పటికీ అమరజీవిగా నిలిచి పోయారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘు రామయ్య గౌడ్, నాయకులు రఘువీర్, సిద్ది వెంకట్ రాములు,మిర్చి వెంకటయ్య, కౌన్సిలర్లు సత్య రఘు పాల్ , సిద్ది విశాలాక్షి, అనూష రఘు, రమేష్, శ్రీనివాస్ కమలాపూర్, రఘు, శ్రీపాద్, సైదప్ప, పాండు, నక్క సత్యనారాయణ, జంగం శేఖర్ సూర్యకాంత్ నామాజీ, చలపతి, శీను, యువ మోర్చా నాయకులు మోహన్ చేతన్ అరవింద్ హనుమంతు పాల్గొన్నారు.