11-02-2025 12:30:59 AM
ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికిన అధికారులు
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో వివిధ రంగాల్లో చేపడు తున్న అభివృద్ధి కార్యక్రమాలు, వృద్ధి ప్రాధాన్యతలు, సాధిస్తున్న ప్రగతి, సామాజిక పరిస్థి తులు, చారిత్రక, సాంస్కృతిక వైభవ విశేషాలను తెలుసుకునేందుకు 12 మంది ప్రతిని ధులతో కూడిన నేపాల్ మీడియా బృందం సోమవారం హైదరాబాద్ చేరుకుంది.
వీరికి ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు స్వాగతం పలికారు. ఈనెల 13 వరకు హైదరాబాద్‌లో ఈ బృందం పర్యటించనుంది. భారత్ బయోటెక్, మేనేజ్‌మెంట్ విద్యను అందిస్తున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, రామోజీ ఫిల్మ్‌సిటీలను నేపాల్ మీడియా సందర్శించనుంది. అలాగే చార్మినార్, గోల్కొండ కోటతోపాటు మరికొన్ని ప్రాంతాలను తిలకించనుంది.