calender_icon.png 15 January, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నంగునూరులో సూక్ష్మరాతి యుగ పనిముట్లు

16-07-2024 12:23:43 AM

సిద్దిపేట అర్బన్, జూలై 15: సిద్దిపేట జిల్లాలో సూక్ష్మరాతి యుగం నాటి పనిముట్లను గుర్తించారు పరిశోధకులు. సోమవారం నంగునూరు మండల కేంద్రంలో వీటిని గుర్తించినట్లు తెలంగాణ కొత్త చరిత్రకారుల బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. గ్రామానికి దక్షిణం వైపు ఉన్న జోకిరమ్మ బండమీద గుర్తించిన ఈ పనిముట్లు చిన్నవి అని, ఇందులో కొన్ని ఒక సెంటిమీటర్ పొడవు ఉండగా, మరికొన్ని అంతకంటే చిన్నవిగా ఉన్నాయని తెలిపారు.

పనిముట్లు బ్లేడ్, బాణం, మూలీకి వంటి ఆకారంలో ఉన్నాయని వెల్లడించారు. క్వార్ట్, చెర్డ్, జాస్పర్, చెకుముకి వంటి రాళ్లతో ఇవి తయారు చేయబడ్డాయని, ఇవి క్రీ.పూ.8000 నుంచి 3000 సంవత్సరాల కాలానికి చెందినవిగా గుర్తించారు. ఈ గ్రామంలోని బండ కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవ ఆవాసంగా ఉండేదని తెలిపారు. గతంలో ఇక్కడ కొత్తరాతి యుగం నాటి రాతి గొడ్డళ్లు, శాతవాహనుల కాలం నాటి టెర్రకోట బొమ్మలు, పూసలు, దేవతా విగ్రహాలు బయటపడినట్లు వెల్లడించారు.