calender_icon.png 8 April, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెన్నెల తహసీల్దార్ సస్పెండ్

07-04-2025 11:04:46 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల తహసీల్దార్ సబ్బ రమేష్ ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం సస్పెండ్ చేశారు. నెన్నెల మండలం చిన్న వెంకటాపూర్ గ్రామంలో ఒక పట్టా భూమిని పట్టాదారుకు తెలియకుండా ఆమె చనిపోయినట్లు సృష్టించి ఇతరులకు పట్టా చేయడంతో బాధిత పట్టాదారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ సబ్బ రమేష్ చేసిన అక్రమాలు వెలుగు చూశాయి. ఈ విషయంపై తహసీల్దార్ సబ్బ రమేష్ ను సస్పెండ్ చేస్తూ నాయబ్ తహసీల్దార్ ప్రకాష్ కు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. అక్రమాలకు సహకరించిన ధరణి ఆపరేటర్ ఉదయ్ ను విధుల నుంచి తొలగించి కైలాష్ అనే ఆపరేటర్ ను నెన్నెల మండలానికి కేటాయించారు.