calender_icon.png 23 February, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెల్లి లక్ష్మీనారాయణను పద్మశ్రీ అవార్డుకు నామినేట్ చేయాలి..

23-02-2025 05:48:01 PM

రాష్ట్ర ప్రభుత్వానికి ముదిరాజ్ సంక్షేమ సమితి విజ్ఞప్తి..

ముషీరాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్ నగరానికి అలనాటి నగర మేయర్ దివంగత నెల్లి లక్ష్మీనారాయణ సేవలు గుర్తించి పద్మశ్రీ అవార్డుకు నామినేట్ చేయాలని ముదిరాజ్ సంక్షేమ సమితి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నెల్లి లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి అని, ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ప్రస్తుత గన్ పార్కును నెల్లి లక్ష్మీనారాయణ గన్ పార్కుగా నామకరణం చేస్తూ వారి విగ్రహాన్ని పెట్టుకోవడానికి అనుమతించాలని కోరింది. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి కన్వీనర్ బానిస నారాయణ ముదిరాజ్, అధ్యక్షులు అల్లాదుర్గం సురేష్ ముదిరాజ్ లు మాట్లాడుతూ... ముదిరాజుల విద్య, ఉద్యోగ, ఆర్థిక అవకాశాలు దెబ్బతిస్తున్న బీసీడీ నుండి బీసీ-ఏ లోకి మార్చి బీసీ-ఏ లో రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు.

నెల్లి లక్ష్మీనారాయణ అణచివేయ బడిన ముదిరాజ్ కులానికి చెందినవాడు కావడం వాల్లనే ఇక్కడి ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని అన్నారు. నాటి సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి ఆదేశాలను సైతం లెక్కచేయకుండా 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో అమరవీరులైన విద్యార్థులను స్మరించుకోవడం కొసం నాడు ఎంసిహెచ్ లో తీర్మానం చేసి అమర వీరుల స్మారక స్థూపానికి 23.02.1970 నాడు శంకుస్థాపన చేయడం నాటి మేయర్ నెల్లి లక్ష్మీనారాయణ ధైర్య సాహసాలకు, తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల వారికి ఉన్న ప్రేమను తెలియజేస్తుందన్నారు. ఈ సమావేశంలో సమితి నాయకులు బాలు గారి నర్సింలు, కటికల శ్రీహరి, తోట సంజయ్, వొన్నాజిపేట్ రమేష్, సినేటి శ్రీనివాస్, జాన్ ముదిరాజ్, అజయ్, గోపి ముదిరాజ్, మాసాయిపేట శ్రీనివాస్, హాస కొత్తూర్ నారాయణ, అనసూయ, విజయలక్ష్మి, ఆనందమూర్తి పాల్గొన్నారు.