నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ సైదిరెడ్డి
నల్లగొండ, జనవరి 30 (విజయక్రాం తి) : బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు గుమ్ముల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డికి లేదని నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి మండిపడ్డారు.
గురు వారం నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగా ణకు అంతర్జాతీయ తీసుకొచ్చిన నేత కేటీఆర్ అని గుర్తు పెట్టుకోవాలన్నారు. కౌన్సిలర్‌గా కూడా గెలవలేనివారు కేటీఆర్ పై అవాకులు చెవాకులు పేలడం సిగ్గుచేట ని విమర్శించారు.
నల్లగొండలో కొనసాగు తున్న అభివృద్ధి పనులన్నీ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రారంభించినవేనని పేర్కొ న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే కా దు.. అప్పులిచ్చేందుకు బ్యాంకులు సైతం నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి హయాంలోనే నల్లగొండ రూపురేఖలు మారాయన్నారు.