calender_icon.png 1 April, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టాల్లో కెరీర్

21-03-2025 12:00:00 AM

‘డీజే టిల్లు’ చిత్రాన్ని చూసిన వారెవరైనా నేహా శెట్టిని మరచిపోవడం కష్టమే. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డకు ఎంత పేరు అయితే వచ్చిందో నేహా శెట్టికి సైతం అంతే పేరు వచ్చింది. రాధికగా ఆమె పేరు మారుమోగిపోయింది. అది వరమో.. శాపమో కానీ సిద్దు జొన్నలగడ్డ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంటే నేహా మాత్రం అక్కడే ఆగిపోయింది. అందం, బోల్డ్‌నెస్‌తో యూత్‌ను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమవుతోంది.

విశ్వక్‌సేన్ హీరోగా రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’పై ఆశలైతే పెట్టుకుంది కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ సినిమా హిట్ అయి ఉంటే ఎలా ఉండేదో కానీ అది దెబ్బేయడంతో అమ్మడి కెరీర్ కష్టాల్లో పడిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అవకాశాల కోసం నానా తంటాలు పడుతోంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దర్శకుల కంట్లో పడేందుకు యత్నిస్తోంది. మరి ఏ దర్శకుడికైనా కనికరం కలుగుతుందో లేదో చూడాలి.