calender_icon.png 16 March, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పన్నుల వసూలు పట్ల నిర్లక్ష్యం

15-03-2025 09:32:22 PM

మున్సిపల్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు..

సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మునిసిపల్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు..

నోటీసులు అందుకున్న వారిలో మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లు,  బిల్ కలెక్టర్ లు..

సంగారెడ్డి (విజయక్రాంతి): మున్సిపాలిటీలకు సంబంధించిన ఇంటి పన్నులు, ప్రాపర్టీ టాక్స్, కుళాయి బిల్లుల వసూల్లో నిర్లక్ష్యం వహించిన సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మునిసిపల్ కమిషనర్లు, మేనేజర్లు, బిల్ కలెక్టర్లకు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు షోకాస్ నోటీసులను జారీ చేశారు. శనివారం సంగారెడ్డి మున్సిపాలిటీలో ఆస్తి పన్నుల వసూలుపై సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా వంద శాతం ఇంటి పన్నులు, కుళాయి బిల్లులు వసూలు చేయాలని టార్గెట్ విధించగా మూడు మున్సిపాలిటీలలో బిల్లుల వసూలు పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గత వారం రోజుల క్రితం కొంతమంది మున్సిపల్ బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మేనేజర్లకు సస్పెన్షన్, షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ సిబ్బంది పనితీరులో మార్పు రాకపోవడంతో జిల్లా కలెక్టర్, జహీరాబాద్ మునిసిపాలిటీ కమిషనర్ ఉమామహేశ్వరరావు, మేనేజర్ ఉమేశ్వర్ లాల్, బిల్ కలెక్టర్లు 8 మందికి షోకాస్ నోటీసులు జారీ చేశారు. సంగారెడ్డి మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ ఎస్సీ వీకే చౌవాన్, మేనేజర్ సూర్య ప్రకాష్, బిల్ కలెక్టర్లు 27 మందికి షోకాజు నోటీసులు జారీ చేశారు. సదాశివపేట మున్సిపాలిటీలో కమిషనర్ జే ఉమా, మేనేజర్ ఉమర్ సింగ్, 14 మంది బిల్ కలెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇంటి పన్నులు, కుళాయి బిల్లును, ప్రాపర్టీ టాక్స్ వంద శాతం వసూలు చేయాలని ఆదేశించారు. షోకాజ్ నోటీసులకు 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని లేకుంటే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోనున్నట్లు నోటీసులలో పేర్కొన్నారు.