స్వచ్ఛభారత్ కు తల్లి రావాలని పిలుపు..
బైంసా (విజయక్రాంతి): బాసరలో వసంత పంచమి ఏర్పాట్లపై ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంపై ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అసహనం వ్యక్తం చేశారు. వసంత పంచమి ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా శుక్రవారం బాసర పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. గోదావరి పుష్కర ఘాట్ల వద్ద చెత్తాచెదారాన్ని చూసినా ఆయన మండిపడ్డారు. గత కొన్ని రోజుల నుంచి భక్తులకు అసౌకర్యం కలగకుండా బాసరలో ఏర్పాట్లు చేయాలని విన్నవించినట్లు గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్థానిక అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సూచనియమన్నారు. ఫలితంగా పుష్కర గట్ల వద్ద స్నానాలకు వచ్చి భక్తులకు బురద చెత్త చెదారం ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో బిజెపి శ్రేణులు గోదావరి వద్ద శనివారం స్వచ్ఛభారత్ నిర్వహించి స్నాన ఘట్టాలను శుభ్రం చేయాలని పిలుపునిచ్చారు. అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వానికి అధికారులకు కనువిప్పు కలిగించి భక్తులకు మేలు చేయాలని విన్నవించారు.