బీఆర్‌ఎస్ నేత దేవీప్రసాద్
హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): కొద్ది రోజులుగా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారికి భరోసా కల్పించే ప్రభుత్వం రాష్ట్రంలో లేదని బీఆర్‌ఎస్ నేత దేవీప్రసాద్ ఆరోపించారు. రైతు భరోసా కింద పెంచిన మొత్తం అన్నదాతలకు ఇస్తామని చెప్పి రైతుబంధుతోనే ప్రభుత్వం సరిపెట్టిందని, అది కూడా ఇప్పటివరకు మొత్తం ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం మాట్లాడుతూ.. అకాల వర్షాలతో ధాన్యం తడిసినా కొనుగోలు చేసే నాథుడే లేడన్నారు. సర్కార్ ప్రకటనలకే పరిమితమైందని, బీఆర్‌ఎస్ నేతృత్వంలో ఆందోళ నలు చేపట్టినా కనికరంలేదని దుయ్యబట్టారు. రేవంత్ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని, అన్నింటికీ షరతులు వర్తిస్తాయని అనే విధంగా పాలన ఉందని ధ్వజమెత్తారు.