calender_icon.png 20 September, 2024 | 5:24 AM

అధికారుల నిర్లక్ష్యం.. చెరువు కలుషితం

17-09-2024 03:29:53 AM

  1. వెల్దుర్తి పిన్ చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలు 
  2. హల్దివాగులోకి ప్రవహిస్తున్న కలుషిత నీరు

వెల్దుర్తి, సెప్టెంబర్ 16: వెల్దుర్తి మండల కేంద్రంలోని పిన్ చెరువు కలుషితమైంది. తాగునీరు అందించే హల్దివాగులోకి కలుషితమైన ఈ చెరువు నీరు ప్రవహిస్తోంది. వర్షాలు బాగా కురవడంతో పిన్ చెరువు అలుగు పారుతోంది. ఈ అలుగు నుంచి కాల్వ ద్వారా హల్దివాగులోకి నీరు చేరుతోంది. అయితే, పిన్ చెరువు నిండకముం దు పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది చెత్తాచెదారం తీసుకొచ్చి మెదక్ రోడ్డుకు ఆనుకొని ఉన్న చెరువు ప్రాంతంలో వేశారు. ప్రస్తుతం చెరువులోకి నీరు రావడంతో వ్యర్థాలు గుట్టలా పేరుకుపోయి నీరంతా కలుషితమవుతోంది. పంచాయతీ అధికారుల అలస త్వం, పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యం కారణం గా చెరువు కలుషితంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా రోడ్డు పక్క న ఉన్న దుకాణాల చెత్తాచెదారం కూడా ఇక్క డే వేయడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. వెంటనే అధికారులు స్పం దించి చెరువులో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని కోరుతున్నారు.