calender_icon.png 3 December, 2024 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి అధికారులు నిర్లక్ష్యం.. కార్మికులకు శాపం

21-11-2024 01:55:18 PM

సెంటినరీ కాలనీలో రూ. 25 లక్షల తో నిర్మించిన మటన్ షాపూలు వృధా 

అసాంఘిక కార్యకారపాలకు అడ్డా...

రామగిరి బిజెపి మండల అధ్యక్షులు శ్రీనివాస్

మంథని, (విజయక్రాంతి): రామగిరి మండలంలోని సెంటనరీ  కాలనీలో సింగరేణి అధికారుల నిర్లక్ష్యం కార్మికులకు శాపంగా మారుతున్నాయని రామగిరి బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు మూరు మూర్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన సెంటినరీ కాలనీలో మాట్లాడుతూ సింగరేణ అధికారులు లక్షల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు చేపట్టి గాలికి వదిలేసారని, దీంతో కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. 

కాలనీలో కార్మికుల కోసం మటన్, చికెన్, చాపలు షాపులను ఒకే కాడ ఏర్పాటు చేస్తామని, సింగరేణి యజమాని కార్మికుల సంక్షేమం కోసం రూ. 25 లక్షల తో గత ఆరు సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టారని, కానీ ఇప్పటివరకు కూడా దానిని ప్రారంభించకపోవడంతో కార్మికులకు శాపంగా మారిందన్నారు. కార్మికులు ఎంతో కష్టపడి కంపెనీకి లాభాలకు తేస్తే, అధికారులు మాత్రం ఇలా వృధాగా, ఇష్ట రాజ్యాంగ డబ్బులు ఖర్చు పెడుతున్నారని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.  వృధాగా ఉన్న మటన్ చికెన్ సెంటర్ ను చూసి సింగరేణి అధికారులపై  కార్మిక కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనీ, అసాంఘిక కార్యకారపాలకు కూడా అడ్డాగా మారిందని, వెంటనే ఈ యొక్క మటన్ సెంటర్ ను ప్రారంభించక పోతే జిఎం ఆఫీస్, ఆర్ జి త్రీ  నీ ముట్టడి చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట బిజెపీ  సీనియర్ నాయకులు మెరుగు శ్రీకాంత్, ఎండి జానీ, సంతు బాలయ్య, శంకర్ పాల్గొన్నారు.