calender_icon.png 16 January, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ వైద్యుడి నిర్లక్ష్యం..రోగి మృతి

25-08-2024 02:37:50 AM

  1. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు 
  2. విచారణ అనంతరం ఆసుపత్రిని సీజ్ చేసిన వైద్యాధికారులు

కామారెడ్డి, ఆగస్టు24 (విజయక్రాంతి): ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్.. జిల్లా వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రైవేట్ వైద్యుడి వైద్య సేవలకు భిక్కనూరుకు చెందిన పెరుముల స్వామి శుక్రవారం రాత్రి మృతిచెందాడు. ఈవిషయమై మృతుడి బంధువులు శనివారం కలెక్టర్‌కు ఆశిష్ సంగ్వాన్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనకు కారణమైన ప్రైవేట్ ఆసుపత్రిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించడంతో జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రభుకిరణ్‌తో పాటు భిక్కనూరు మెడికల్ ఆఫీసర్ యేమిమా, వైద్య సిబ్బందితో కలిసి సదరు ప్రవేట్ ఆసుపత్రిని తనిఖీ చేశారు.

మెడికల్ షాపు నిర్వహకుడు లైసెన్స్ హోల్డర్ అందుబాటులో లేకపోవడంతో లైసెన్స్ ఉన్న క్యాండెట్ ఆసుపత్రిలో లేకపోవడం, ఆమె భర్త ట్రీట్మెంట్ చేసి.. వ్యక్తి మృతికి కారకుడయ్యాడని మండిపడ్డారు. ఆర్‌ఎంపీలు, పీఎంపీలు సీజనల్ వ్యాధులకు సంబంధించి మూడునెలల పాటు ట్రీట్మెంట్ చేయకుండా ఆర్డర్ జారీచేయాలని మెడికల్ ఆఫీసర్‌కు డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆదేశించారు. కేవలం సాధారణ జ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చే వారికి మాత్రమే చికిత్స అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులకు సంబంధించి ట్రిట్మెంట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీజనల్ జ్వరాలతో బాధపడేవారు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని కోరారు.