calender_icon.png 26 October, 2024 | 12:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం..

26-10-2024 11:02:39 AM

ఇంటిముందు తెగిపడిన విద్యుత్ వైర్ తగిలి మహిళ మృతి

వాకిలి ఊడ్చే క్రమంలో ప్రమాదం..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): తుప్పు పట్టిన విద్యుత్ స్తంభం నుండి తెగిపడిన విద్యుత్ వైరు తగిలి మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా దేశీటిక్యాల గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన భాగ్యమ్మ(32) పొలం పనులకు వెళ్దామని తెల్లవారుజామున ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న మహిళ అప్పటికే తెగిపడి ఉన్న విద్యుత్ వైర్ ను గమనించక తగలడంతో విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే తల్లడిల్లుతూ ప్రాణం వదిలింది. తుప్పు పట్టిన విద్యుత్ స్తంభం వైర్లను మార్చాలని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఈ నేపథ్యంలోనే విద్యుత్ వైర్ తగిలి ప్రమాదం సంభవించిందని గ్రామస్తులు ఆరోపించారు. విద్యుత్ సరఫరా అవుతూ వేలాడుతున్న పట్టించుకోకపోవడం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఇలా ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలికి భర్త ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.