calender_icon.png 23 October, 2024 | 4:56 AM

పెద్దమ్మతల్లి ఆలయ నిర్వహణపై నిర్లక్ష్యం

03-08-2024 03:28:13 AM

  1. దృష్టి సారించని దేవాదాయ శాఖ 
  2. అనధికారికంగా అర్చకుల నియామకం! 
  3. టెండర్లు పూర్తయినా అప్పగించని దుకాణాలు 
  4. ప్రిన్సిపల్ సెక్రటరీకి తప్పుడు నివేదిక

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 2 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం వెలసిన కనకదుర్గా దేవస్థానం (పెద్దమ్మతల్లి) ఆలయ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. అధికారుల నిర్లక్ష్యం, పర్యవే క్షణలోపంతో ఆభివృద్ధికి నోచుకోవడం లేదు. వసతుల లేమితో భక్తులు ఇబ్బందు లు పడుతున్నారు. పర్యవేక్షణ కొరవడటం తో ఆలయ ఆదాయానికి గండి పడుతున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అమ్మ వారికి భక్తులు సమర్పించిన చీరలను వేలం పాట నిర్వహించి విక్రయించకుండా ప్రైవే టు వ్యక్తులకు అమ్ముతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. తలనీలాల విక్రయానికి వేలంపాట నిర్వహించకపోవడంతో రూ.15 లక్షల ఆదాయాన్ని కోల్పో వల్సి వస్తున్నది.

ఆలయంలో అర్చకుల నియామకం దేవాదాయ కమిషన్ ఆదేశాల మేరకు జరగాలి. కానీ పెద్దమ్మతల్లి ఆలయంలో ముగ్గురు అర్చకుల నియామాకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని తెలుస్తున్నది. ఆలయ సముదాయంలోని దుకా ణాల నిర్వహణకు గత నెల 27న టెండర్లు నిర్వహించారు. కానీ ఇప్పటి వరకు టెండర్లు పొందిన వారికి దుకాణాలు అప్పగింలేదు. దీనికి తోడు బకాయి ఉన్న దుకాణాలకు సీల్ వేయడం గమనార్హం. సీల్ వేయడం వల్ల వేలం దక్కించుకున్న వారు డబ్బులు చెల్లించబోమని మొండికేస్తున్నారు. ఇది పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.  

ధర్మకర్తల నియామకాల్లో పొరపాట్లు

దేవాలయ భూములకు సంబంధించి గతంలో డీసీ కోర్టు వరంగల్‌లో కేసు నమోదవగా.. 2008లో ఆలయానికి అనుకూలం గా తీర్పు వచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారికే గత ఆలయ పాలకమం డలిలో ధర్మకర్తలుగా స్థానం కల్పించారు. నిబంధనల ప్రకారం దేవాలయానికి నష్టం చేకూర్చే వారికి అవకాశమివ్వొద్దు. అయినా పాలకమండలిలో స్థానం కల్పించడంతో కొందరు లోకాయుక్తను అశ్రయించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కేసు నమోదు చేయాలని ఆదేశిస్తే అధికారులు నమోదు చేయకపోవడం గమనార్హం. ఇంత జరుగుతున్నా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు పెద్దమ్మతల్లి ఆలయంపై దృష్టి సారించడంలేదు.

రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన రెండు ఫంక్షన్‌హాళ్ల నిర్వహణకు టెండర్ పిలిచినా సౌక ర్యాలు లేకపోవడంతో ఎవరూ ముం దుకు రావ డం లేదు. దీంతో టెండర్‌దారుడు వదులుకునే యోచనలో ఉన్నారు. దేవాదాయ ధర్మ కర్తల నియామకాల్లో జరిగిన పొరపాట్ల వల్ల ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదని పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వాస్తవ పరిస్థితిని తెలియజేయాలని దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఈవోను ఆదేశించారు.