calender_icon.png 9 November, 2024 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో నిర్లక్ష్యం

09-11-2024 12:19:03 AM

ఇద్దరు ప్రధానోపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు

ఖమ్మం, నవంబర్ 8 (విజయక్రాంతి): డీఎస్సీ 2024లో ఎంపికై ఉద్యోగం చేస్తూ ఇటీవల కొలువులు కోల్పోయిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ప్రధానోపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ ఆర్జేడీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఏడుగురి సర్టిఫికెట్లు చెల్లవంటూ వారిని ఉద్యోగాల్లోంచి తొలగించి, వారి స్థ్ధానంలో కొత్త వారిని తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ కేసులో ఇద్దరు ప్రధానోపాధ్యాయులను బాధ్యులుగా గుర్తించి.. వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపా ధ్యాయుడు రంగారెడ్డి, కొణిజర్ల మండలం గుబ్బగుర్తి జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివనారాయ ణను సస్పెండ్ చేస్తూ  విద్యాశాఖ ఆర్జేడీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

డీఎస్సీలో ఎంపికై ఉద్యోగాలు పొందినవారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ విషయంలో ఈ ఇద్దరు ప్రధానోపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని రుజువవడంతో వారిని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇద్దరు ప్రధానోపాధ్యాయులు సస్పెన్షన్‌కు గురవ డం ఖమ్మం జిల్లా విద్యాశాఖలో చర్చనీ యాంశంగా మారింది.