calender_icon.png 1 November, 2024 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల అమలులో సర్కారు నిర్లక్ష్యం

02-08-2024 02:01:43 AM

  1. రాహుల్, రేవంత్‌రెడ్డి ద్వంద్వ వైఖరిని ఎండగడతాం 
  2. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (విజయక్రాంతి): జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ సర్కారు నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తోందని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. కులగణన విషయంలో జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ, తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి ద్వంద వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. వారు తీరును ఎండగడతామని హెచ్చరించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వ హిస్తే ఊరుకోమన్నారు.

బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఈ అన్యాయంపై మౌనం వీడాలన్నారు. రాష్ట్ర  ప్రభు త్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నెల 4 నుంచి 20 వరకు జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. 7న ఇందిరాపార్క్ వద్ద గాంధేయ మార్గంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. సమావేశంలో టీ జర్న లిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, వివిధ బీసీ సంఘాల నాయకులు, అడ్వకేట్ లొడంగి గోవర్దన్, సిద్దేశ్వర్, కొంపెల్లి రాజు, దేశం మహేష్ గౌడ్, కొంగర నరహరి, కే విజయ్‌కుమార్, పోశం అశోక్ తదితరులు పాల్గొన్నారు.