calender_icon.png 4 April, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్‌లో కీలక రంగాలపై నిర్లక్ష్యం

29-03-2025 02:15:04 AM

విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై శీతకన్ను

కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): తెలంగాణ బడ్జెట్‌లో కీలకమైన ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి పూర్తిని పూర్తిగా విస్మరించారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి ఆరోపించారు.

ప్రజల జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే కీలక రంగాలపై కొనసాగుతున్న కాంగ్రె స్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మరోసారి ఈ బడ్జెట్ స్పష్టం చేసిందని ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి చేసి న కేటాయింపులు ఏ మాత్రం సరిపోవన్నా రు.

ఎంతో కీలకమైన ఈ రంగాలపై గత ప్ర భుత్వ విధానాలనే రే వంత్ సర్కార్ కూడా అనుసరిస్తోందని వాపోయారు. తెలంగాణలో విద్యా మౌళి క సదుపాయాల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అనేక నివేదికలు వెల్లడించినా రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పాఠశాలల్లో సరైన భవనాలు, మరుగుదొడ్లు, తగినంత బోధనా సిబ్బంది లేకుండానే కొనసాగుతున్నాయన్నారు. అత్యంత ముఖ్యమైన ఈ సమస్యను పరిష్కరించకపోవడం దురదృష్టకరమని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య కోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులు జా తీయ సగటు 15 శాతం కంటే చాలా తక్కువగా ఉండటం విద్య పట్ల వారికున్న వైఖరిని ప్రతిబింబిస్తుందని విమర్శించారు.