18-03-2025 01:38:19 AM
మాజీమంత్రి గంగుల కమలాకర్
విదేశీ విద్యా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ప్రభుత్వ సమాధానంలోనే నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మాజీమంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. అసెంబ్లీలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.. విదేశీ విద్యకు ఎంపిక చేసిన వారి సంఖ్య కేవలం 1,913 మాత్రమేనని ప్రభుత్వం చెప్పడం స్పష్టంగా లేదన్నారు.
ఈ పథకం కింద విదేశాల్లో వెళ్లి చదువుకునేందుకు విద్యార్థుల ఎంపిక ప్రక్రియ, నిధుల విడుదల విషయంలో కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా కేసీఆర్ విదేశీ విద్యాపథకాన్ని 2016లో ప్రవేశపెట్టారని తెలిపారు.
తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏడాది 300 మంది విద్యార్థులను ఈ పథకం కింద ఎంపిక చేశామని, కాంగ్రెస్ వచ్చాక ఇది నిలిచిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలవుతున్నా బీసీ, ఎస్టీ, మైనార్టీల విద్యార్థుల లిస్టును ప్రకటించలేదని, బకాయి నిధులను విడుదల చేయలేదని విమర్శించారు.