calender_icon.png 9 February, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘త్రిబాణధారి బార్భరిక్’ నుంచి నీవల్లే సాంగ్ రిలీజ్..

08-02-2025 11:32:59 PM

ఈ మధ్యకాలంలో యూనిక్ కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమాలు ఆడియెన్స్ మెప్పు పొందుతున్నాయి. ఈ క్రమంలోనే ‘త్రిబాణధారి బార్బరిక్’ అంటూ సరికొత్త పాయింట్‌తో విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న ‘బార్బరిక్’ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి శుక్రవారం నీవల్లే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటకు రఘురాం అందించిన లిరిక్స్, సిద్ శ్రీరామ్ సింగింగ్ మేజర్ హైలైట్స్. సాంగ్‌లో కనిపిస్తున్న సీన్స్ యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.