న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విద్య వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ (NEET UG 2025) పరీక్షల నిర్వహణపై ఎన్‌టీఏ (NTA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి నీట్ 2025 పరీక్షను పెన్-పేపర్ (OMR based) విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షను దేశమంతా ఒకే రోజు ఒకే షిఫ్టులో NEET పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. విద్య, ఆరోగ్య శాఖల మధ్య సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం చివరకు ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య పరంగా దేశంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్ష, 2024లో రికార్డు స్థాయిలో 24 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం NTA ప్రతి సంవత్సరం నీట్‌ను నిర్వహిస్తుంది. MBSS కోర్సుకు మొత్తం 1,08,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాగా, గత ఏడాది ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీకైనట్లు వార్తలోచ్చినా విషయం తెలిసిందే...