calender_icon.png 30 October, 2024 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్‌పై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ చేపట్టాలి

06-07-2024 02:02:57 AM

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల, జూలై 5 (విజయక్రాంతి): నీట్ లీకేజీలో రూ.కోట్లు చేతులు మారాయని, అవకతవకలపై సుప్రీం కోర్టు జడ్జీతో విచారణ చేయించాలని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాలలోని ఇందిరా భవన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ లీకేజీ విచారణ సీబీఐ చేతిలోకి వెళ్లిందన్నారు. సీబీఐ కేంద్ర ప్రభుత సంస్థగా మారిందని, కేంద్రానికి సీబీఐ అనుకూలంగా రిపోర్ట్ ఇస్తుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుతం చెలగాటం ఆడుకుంటున్నదని ఆయన మండిపడ్డారు. పేపర్ లీకేజీపై సుప్రీం కోర్టు న్యాయమూర్తితో  విచారణ చేయిస్తేనే నిజానిజాలు వెల్లడవుతాయ న్నారు. పరీక్ష నిరహణలో పారదరకత లోపించిందని ఆయన విమర్శించారు.