calender_icon.png 19 January, 2025 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్‌ను తక్షణమే రద్దు చేయాలి

03-07-2024 12:10:02 AM

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

ముషీరాబాద్, జూలై 2: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్రం అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. మంగళవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నీట్ పరీక్షకు హాజరైన 24 లక్షల మంది నీట్ విద్యార్థులకు న్యాయం చేయడంతో పాటు రాను న్న రోజుల్లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్‌ను తక్షణమే రద్దు చేయాలన్నారు. ఇంత జరుగుతున్నా కేంద్రం మౌనంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, విద్యార్థి సంఘం నాయకుడు తాటికొండ విక్రం గౌడ్, అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.