హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): నీట్ పీజీ 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను నేషనల్ మెడికల్ కౌన్సిల్ విడుదల చేసింది. త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నది. ఈ నెల 20న రిజిస్ట్రేషన్ ప్రారంభమై, ఈ నెల 26 మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. విద్యార్థులు ఆప్షన్స్ కోసం ఈ నెల 23 నుంచి 26 వరకు గడువు ఉంటుంది. ఛాయిస్ లాకింగ్ ఈ నెల 26న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.55 వరకు సాగుతుంది. సీట్ల కేటాయింపు ప్రక్రియ ఈ నెల 27 నుంచి 29 వరకు జరుగుతుంది. మొదటి దశ సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 30న విడుదలవుతుంది. అక్టోబర్ 1 నుంచి 8వ తేదీ లోపల కేటాయించిన కాలేజీల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.