calender_icon.png 2 November, 2024 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్ లీక్ వ్యవస్థీకృతం కాదు

03-08-2024 05:16:40 AM

పునఃపరీక్ష అవసరం లేదు: సుప్రీం

న్యూఢిల్లీ, ఆగస్టు 2: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వ్యవస్థీకృతంగా జరుగలేదని, కొన్ని ప్రాంతాల్లోనే లీకైందని సుప్రీంకోర్టు తెలిపింది. అందువల్ల పరీక్ష మొత్తం రద్దుచేసి తిరిగి నిర్వహించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. నీట్ పేపర్ లీక్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. పరీక్ష సమగ్రతకు ముప్పు వాటిల్లినట్టు ఆధారాలు లేవని పేర్కొన్నది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చైర్మన్ కే రాధాకృష్ణన్ నేతృత్వంలో నియమించిన ప్యానల్ ఎన్టీఏ పరీక్షల నిర్వహణపై మరింత విస్కృతంగా అధ్యయనం చేసి సూచనలు ఇచ్చేందుకు వీలుగా కమిటీ కాలపరిమితిని సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. నీట్ యూజీ పరీక్షను తిగిరి నిర్వహించాలన్న వాదనను తోసి పుచ్చింది. పేపర్ లీక్ ప్రధానంగా పాట్నా, హజారీబాగ్‌కే పరిమితమైందని పేర్కొన్నది.