- 61 నుంచి 17కు పడిపోయిన టాప్ ర్యాంకర్ల సంఖ్య
- చెరువులో పడేసిన 16 ఫోన్లను రికవరీ చేసిన సీబీఐ
న్యూఢిల్లీ, జూలై 25: నీట్ యూజీ తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ దఫా టాప్ ర్యాంక్ సాధించిన వారి సంఖ్య 17కు తగ్గిం ది. నీట్ పరీక్షపై వివాదం వేళ ఫిజిక్స్ విభాగంలోని ఓ ప్రశ్నకు ఒకటే సమాధానం ఉం టుందని నిపుణుల కమిటీ తేల్చింది. దాని ఆధారంగా ఫలితాలను సవరించాలని చెప్పి న నేపథ్యంలో పరీక్ష తుది ఫలితాలను ఎన్టీ యే విడుదల చేసింది. ఇందులో 4.2 లక్షల మంది విద్యార్థులు 5 మార్కులు కోల్పోయా రు. దీంతో మరోసారి రివైజ్డ్ ర్యాంకులను విడుదల చేయడం అనివార్యంగా మారింది. 720కి గాను 720 మార్కులు సాధించి టా ప్ ర్యాంక్ పొందినవారి సంఖ్య 61 నుంచి 17కు తగ్గింది.
చెరువులో 16 ఫోన్ల రికవరీ
నీట్ లీకేజీ విషయంలోనూ సీబీఐ దర్యా ప్తు ముమ్మరంగా సాగుతోంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన నిందితుడు అవినాశ్‌కు చెందిన 16 ఫోన్లను సీబీఐ అధికారులు చెరువులో నుంచి స్వాధీనం చేసుకున్నారు. నింది తుడిని బీహార్‌లోని పాట్నా సీబీఐ కోర్టులో హాజరుపరచగా విచారణ కోసం జూలై 30 వరకు న్యాయస్థానం కస్టడీకి అప్పగించింది.