calender_icon.png 29 April, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి

29-04-2025 12:38:54 AM

ఖమ్మం, ఏప్రిల్  28 ( విజయక్రాంతి ):-వైద్య కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం మే 4న జరిగే నీట్ యు.జి. ప్రవేశ పరీక్షను జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేసి నిర్వహించాలని  అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సోమవారం అదనపు కలెక్టర్, అదనపు డిసిపి ప్రసాద రావు తో కలిసి, కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ  ఖమ్మంజిల్లా పరిధిలో మే 4న జరిగే నీట్ యు.జి. ప్రవేశ పరీక్ష రాసే 2739 మంది విద్యార్థుల కోసం 6 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించామని అన్నారు.పరీక్షకు ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఎక్కడా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ నమోదు కాకుండా జాగ్రత్తలు వహించాలని,

సీసీటీవీ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి పరీక్షను క్షుణ్ణంగా పర్యవేక్షించాలని అన్నారు.మే 4న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1-30 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వాలని, మధ్యాహ్నం 1-30 నిమిషాలకు గేట్ మూసి వేయడం జరుగుతుందని, 1-40 లోపు విద్యార్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ (ఐడి కార్డు అలాటెడ్ సెంటర్) పూర్తి చేసుకుని పరీక్ష హాల్ కు చేరుకోవాలని సూచించారు.

నీట్ ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో నీట్ జిల్లా నోడల్ అధికారి నరేంద్ర కుమార్, జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి డా. బి. కళావతి బాయి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, ఎస్‌ఇ ట్రాన్స్కో శ్రీనివాసా చారి, తహశీల్దార్లు రవి కుమార్, రాంప్రసాద్, విల్సన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.