calender_icon.png 21 September, 2024 | 5:37 AM

నీట్ కౌన్సెలింగ్.. కోర్టుకెళ్లిన విద్యార్థులకు ఊరట

21-09-2024 01:50:27 AM

కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు సర్కారు అంగీకారం

ఈ ఒక్కసారికే అవకాశం కల్పించిన ప్రభుత్వం

తదుపరి విచారణ కోసం ప్రతివాదులందరికీ నోటీసులు

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): నీట్ కౌన్సెలింగ్‌లో స్థానికత అంశం లో తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర విద్యా ర్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు సర్కా రు అంగీకరించింది. కౌన్సెలింగ్ కోసం సమ యం లేకపోవడంతో ఈ ఒక్కసారికి అవకా శం కల్పించాలని నిర్ణయించినట్లు సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కారు తెలిపింది. స్థానికత వ్యవహారంపై హైకోర్టు తీర్పు ను తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా...

చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ ఒక్కసారికి హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు అవకాశం ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. స్థానికతపై 4 రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నాయని వారు గుర్తు చేశారు. అన్ని తీర్పులు స్పష్టంగానే ఉన్నా మళ్లీ కోర్టును ఆశ్రయించారని వెల్లడించారు. ఈ వాదనపై విద్యార్థుల తరఫు న్యాయవాది విభేదిస్తూ కేవలం 2, 3 ఏళ్ల చదువుల కోసం రాష్ట్రానికి దూరంగా ఉంటే స్థానికతలను దూరం చేయడమేంటని ప్రశ్నించారు.

దీనిపై రాష్ట్ర ప్రభు త్వం అభిప్రాయాన్ని వెల్లడించాలని చీఫ్ జస్టిస్ అడగగా విద్యార్థుల భవి ష్యత్తు, తగినంత సమయం లేనందున కౌన్సెలింగ్‌కు అనుమతించాలని నిర్ణయం తీసుకు న్నామని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. తదుపరి విచారణ కోసం ప్రతివాదులందరికీ కోర్టు నోటీసులు ఇచ్చింది. 3 వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ సర్కారు అంగీకరించినందున హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం ఇస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఉత్త ర్వులు జారీ చేసింది.