న్యూఢిల్లీ: భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా పారిస్ డైమండ్ లీగ్ మీట్ నుంచి తప్పుకున్నాడు. ఒలింపిక్స్‌కు ముందు గాయపడడం ఇష్టం లేదని పేర్కొన్న నీరజ్ శారీరకంగా బలంగా ఉండడంపై దృష్టి సారించినట్లు తెలిపాడు. ‘ఒలింపిక్స్‌కు ముం దు చాలా ఈవెం ట్స్‌లో పాల్గొనాలని భావించా. కానీ ఈ సమ యంలో ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఇటీవలే తరచూ గజ్జల్లో కాస్త ఇబ్బం ది ఎదురైనట్లుగా అనిపిస్తోంది. అందుకే విశ్వక్రీడలకు ముందు రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో పారిస్ డైమండ్ లీగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఫిట్‌నెస్‌పై శ్రద్ద వహిస్తూనే ప్రాక్టీస్‌కు పూర్తి స్థాయి సమయం కేటాయించాలనుకుంటున్నా’ అని నీరజ్ పేర్కొన్నాడు. ఇటీవలే పావో నుర్మీ గేమ్స్‌లో బరిలోకి దిగిన నీరజ్ స్వర్ణంతో మెరిసిన సంగతి తెలిసిందే.