calender_icon.png 27 December, 2024 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌతాఫ్రికాకు నీరజ్

09-11-2024 01:15:17 AM

న్యూఢిల్లీ: భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ఈ నెలాఖరున సాతాఫ్రికాకు వెళ్లనున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న పోటీలకు ముందస్తుగా సిద్ధమయ్యేందుకు నీరజ్ ఆఫ్ సీజన్ ట్రెయినింగ్‌కు బయల్దేరి వెళ్లనున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన బ్రసెల్ డైమండ్ లీగ్ మీట్ ఫైనల్లో పాల్గొన్న నీరజ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో నీరజ్ చోప్రా సౌతాఫ్రికాలో 31 రోజల పాటు గడపనున్నాడు. అతని ట్రెయినింగ్ ఖర్చునంతా క్రీడాశాఖ భరించనుంది. గతంలో టోక్యో, పారిస్ ఒలింపిక్స్‌కు ముందు కూడా నీరజ్ చోప్రా సౌతాఫ్రికాలోని పోచెఫ్స్రూమ్‌లో ట్రెయిన్ తీసుకున్నాడు.