calender_icon.png 20 November, 2024 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లుసాన్నే బరిలో నీరజ్

18-08-2024 12:00:00 AM

సర్జరీ వార్తలను ఖండించిన స్టార్ అథ్లెట్

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో రజతం సాధించి వరుసగా రెండో పతకంతో చరిత్ర సృష్టించిన భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరో ఈవెంట్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ నెల 22న స్విట్జర్లాండ్ వేదికగా జరగనున్న లుసాన్నే డైమండ్ లీగ్ మీట్‌లో నీరజ్ పాల్గొంటున్నట్లు స్వయంగా ప్రకటించాడు. ఒలింపిక్స్ అనంతరం స్వదేశానికి రాకుండా జర్మనీ వెళ్లిన నీరజ్ సర్జరీ చేయించుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. శనివారం వర్చువల్ మీడియా సమవేశంలో మాట్లాడిన నీరజ్  సర్జరీ వార్తలను ఖండించాడు.‘ గాయంపై ఆందోళన అవసరం లేదు. లుసాన్నే మీట్‌లో బరిలోకి దిగుతున్నా. దీనికోసం ప్రిపరేషన్‌ను ఇప్పటికే ప్రారంభించా.

90 మీటర్లు విసరడంపై చాలాసార్లు మాట్లాడుకున్నాం. పారిస్ ఒలింపిక్స్‌లో అది జరుగుతుందనుకున్నా.. కొద్దిలో మిస్ అయింది. బ్రస్సెల్ ఫైనల్స్‌కు ముందు రెండు డైమండ్ లీగ్స్‌లో పాల్గొంటున్నా. నా నుంచి ఎప్పుడు 100 శాతం ప్రదర్శన ఉంటుంది. 90 మీటర్ల లక్ష్యం దేవుడికే వదిలేద్దాం’ అని నీరజ్ చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్ 14న జరగనున్న బ్రస్సెల్ మీట్ ఫైనల్ జరగనుంది. ఈ ఫైనల్‌కు ముందు నీరజ్ జ్యురిచ్ డైమండ్ లీగ్ (సెప్టెంబర్ 5న) మీట్‌లో బరిలోకి దిగనున్నాడు.