న్యూఢిల్లీ: డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ఏడడుగులు వేశాడు. సోనీపట్‌కు చెందిన హిమానీ అనే అమ్మాయితో రెండు రోజుల క్రితమే నీరజ్ వివాహం అయింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం జరగ్గా.. ఆదివారం నీరజ్ ఆ ఫొటోలను పంచుకున్నాడు. జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టినట్లు తెలిపాడు.
సోనిపట్‌కు చెందిన హిమానీ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది. వివాహం ఎక్కడ జరిగిందో బయటకు చెప్పకపోయినప్పటికీ నూతన జంట మాత్రం ప్రస్తుతం హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లినట్లు నీరజ్ బంధువులు తెలిపారు. నీరజ్ చోప్రా భారత్ తరఫున జావెలిన్ త్రోలో రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాడు.