calender_icon.png 18 January, 2025 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి హృదయ స్పందన.. క్రీడా స్ఫూర్తికే బంగారు పతకం

10-08-2024 03:07:26 PM

పాకిస్తాన్ జావెలిన్ త్రో అథ్లెట్ అర్షద్ నదీమ్ పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం గెలిచారు. ఆగస్టు 8న రాత్రి జరిగిన ఫైనల్లో 92.97 మీటర్లు జావెలిన్ విసిరి ఒలింపిక్ రికార్డు సైతం సృష్టించారు. అదే ఈవెంట్‌లో రెండో స్థానంలో నిలిచిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రా రజతం సాధించిన విషయం తెలిసిందే. ఈవెంట్ తదనంతరం నీరజ్ చోప్రా తల్లి సరోజా దేవి మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు చెందిన అర్హద్ కూడా నాకు కొడుకులాంటి వాడే అని అన్నారు.

ఆమె మాటలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అర్షద్‌ నదీమ్ మాట్లాడారు. తన ప్లానింగ్, టార్గెట్, మ్యాచ్ ఒత్తిడి, తదితర విషయాలతో పాటు నీరజ్ చోప్రా తల్లి అన్న ఆ మాటలపై కూడా స్పందించారు. తల్లి తాలూకు క్రీడా స్ఫూర్తికి కొడుకు నీరజ్ నిలువెత్తు ప్రతిబింబం అంటూ.. సోషల్ మీడియాలో వైరల్ ఐన కామెంట్ల గురించి మాట్లాడుతూ మా అమ్మకు భారత్, పాకిస్తాన్ సంబంధాలు, సోషల్ మీడియా గురించి తెలియదు. కేవలం భారత దేశ తల్లి  హృదయం మాత్రమే అలా స్పందించగలదు అన్నారు.