calender_icon.png 6 November, 2024 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీరజ్‌పైనే నజర్

13-05-2024 12:08:53 AM

భువనేశ్వర్: నాలుగు రోజుల పాటు జరగనున్న నేషనల్ ఫెడరేషన్ కప్‌లో అందరి దృష్టి భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాపైనే నిలవనుంది. స్వదేశంలో మూడేళ్ల తర్వాత ఫెడరేషన్ కప్‌లో బరిలోకి దిగనుండడంతో నీరజ్ ఆటను చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. మెన్స్ జావెలిన్ త్రో క్వాలిఫ యింగ్ రౌండ్ ఈ బుధవారం జరగనుండగా.. ఫైనల్ గురువారం జరగనుం ది. ఇక ఆదివారం ప్రారంభమైన ఫెడరేషన్ కప్‌లో భారత అథ్లెట్లు పతకాల వేటను నిధానంగా మొదలుపెట్టారు. మహిళల 400 మీటర్ల హార్డిల్స్‌లో వీర్‌పాల్ కౌర్ స్వర్ణ పతకం నెగ్గింది. వీర్‌పా ల్  రేసును 59.43 సెకన్లలో పూర్తి చేసి పసిడి కైవసం చేసుకోగా.. శాలిని (1:00. 73 సెకన్లు), రమణ్‌దీప్ కౌర్ (1:01.29 సెకన్లు) వరసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. ఇక పురుషుల 400 మీటర్ల హార్డిల్స్‌లో తమిళనాడుకు చెందిన సంతోష్ కుమార్ (50.04 సెకన్లు) స్వర్ణం గెలుచుకున్నాడు.