calender_icon.png 18 January, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణ మధ్య రైల్వే ఏజీఎంగా నీరజ్ అగర్వాల్

06-09-2024 01:28:21 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): దక్షిణ మధ్య రైల్వే అడిష నల్ జనరల్ మేనేజర్‌గా నీరజ్ అగర్వాల్ గురువారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో బాధ్యతలు చేపట్టారు. 1987 ఇండియన్ రైల్వేస్ సర్వీసెస్ బ్యాచ్‌కు చెందిన అగర్వాల్ ప్రస్తుత నియామకానికి ముందు దక్షిణ మధ్య రైల్వేలోని నిర్మాణ విభాగంలో చీఫ్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. డిడికేటెడ్ ప్రైవేట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కైఛారైడ్ వంటి కంపెనీల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పనిచేశారు. అగర్వాల్ రాయ్‌పూర్‌లోని గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్, భోపాల్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుం చి మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ పొం దారు. బెంగళూరు ఐఐఎంలో పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్  విద్యనభ్యసించారు.