calender_icon.png 3 March, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాడీ కార్పొరేషన్‌కు నీరా కేఫ్ అప్పగింత

01-03-2025 11:48:46 PM

హైదరాబాద్ (విజయక్రాంతి): నెక్లస్ రోడ్డులోని నీరా కేఫ్ నిర్వహణ బాధ్యతలను తెలంగాణ టాడీ టాపర్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(టీటీటీసీఎఫ్‌సీ)కి  అప్పగించడానికి తెలంగాణ టూరిజం కార్పొరేషన్ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇటీవల టూరిజం కార్పొరేషన్, టాడీ కార్పొరేషన్ ఎండీలు, మంత్రుల మధ్య కీలక చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం టాడీ, నీరా కేఫ్‌ను వదులుకునేందుకు టీజీటీడీసీ అంగీకరించింది. అయితే రెండు కార్పొరేషన్ల మధ్య కొన్ని చర్చలు జరిగిన అనంతరం ఈ అప్పగింత ప్రక్రియ పూర్తవుతోందని ఆయావర్గాలు భావిస్తున్నాయి.