31-03-2025 12:00:00 AM
స్కూలు రోజుల్లో
ఉదయాన్నే గుడ్‌మార్నింగ్
సాయంత్రం గుడ్ ఈవెనింగ్
రాత్రి గుడ్‌నైట్ చెప్పి తానూ
నిద్రపోయేది
పెద్దవాడినై కాలేజీలో చేరాక
హాయ్, హలో బాస్, బై బ్రో అనేది
సమయ పాలన లేకుండా
నేను ఉద్యోగ పర్వంలో వనవాసం చేసి
తిరిగొచ్చి చూస్తే ఏముంది..
ఇంటిముందు ఖాళీ
అచేతనంగా ఆత్మీయుణ్ణి
కోల్పోయినట్టు నిలబడిపోయా
నిన్ననే మున్సిపల్ వాళ్ళు కొట్టేసారు
అంటూ అమ్మ ఇంట్లోకి వెళ్ళింది.
- వారాల ఆనంద్