calender_icon.png 26 December, 2024 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన నీలం మధు

25-12-2024 11:23:11 PM

పటాన్ చెరు,(విజయక్రాంతి): సీఎం హోదాలో మెదక్ పట్టణానికి మొదటిసారి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ కంటెస్టెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ బుధవారం స్వాగతం పలికారు.  పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతో కలిసి ఏడుపాయల దుర్గామాత ను దర్శించుకున్నారు. వంద సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్న మెదక్ చర్చికి సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి వెళ్లి ప్రార్థనలు చేశారు. అనంతరం మెదక్ పట్టణంలో  నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నీలం మధు పాల్గొన్నారు.