calender_icon.png 4 February, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి బీజేపీ అధ్యక్షుడిగా నీలం చిన్న రాజులు

04-02-2025 12:00:00 AM

కార్యకర్త నుంచి జిల్లా అధ్యక్ష పదవి వరించిన వైనం

కామారెడ్డి ఫిబ్రవరి  3 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షునిగా బీసీ వర్గానికి చెందిన నీలం చిన్న రాజులు పార్టీ నియామకం చేసింది. కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవుని పల్లి గ్రామానికి చెందిన నీలం చిన్నరాజులు పార్టీ కార్యకర్త నుంచి అంచలంచలుగా ఎదుగుతున్నారు. బి ఎ ఎల్ ఎల్ బి చేసిన నీలం చిన్న రాజులు 2001లో బిజెపి సభ్యత్వాన్ని పొందారు. 2003లో దేవుని పల్లి గ్రామ బిజెపి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 2006లో బిజెపి మండల పార్టీ అధ్యక్షునిగా ఎన్నిక య్యారు.

2009లో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఎన్నిక కావడంతో పాటు కామా రెడ్డి మండల ఇన్చార్జిగా వ్యవహరించారు. 2012లో బిజెపి నిజాంబాద్ డిస్టిక్ సెక్రెటరీగా నియామకం కావడంతో పాటు భిక్కనూరు మండల ఇన్చార్జిగా వ్యవహ రించారు. 2014లో బిజెపి కామారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ గా పనిచేశారు. 2016లో బిజెపి నిజాంబాద్ జిల్లా జనరల్ సెక్రెటరీగా వ్యవహరించారు. 2018లో కామారెడ్డి జిల్లా బిజెపి జనరల్ సెక్రెటరీగా పనిచేశారు. 2021లో బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా కొనసాగారు.

2023లో బిజెపి నిర్మల్ డిస్ట్రిక్ట్ ఖానాపూర్ అసెంబ్లీ ప్రబారిగా వ్యవహరించారు. 2024లో నిజాంబాద్ ఎంపీ ఎలక్షన్ లో బోధన్ నియోజకవర్గం అసెంబ్లీ ఇన్చార్జిగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో నిజామాబాద్ ఎల క్షన్లో 2010లో ఇన్ చార్జిగా వ్యవహరిం చారు.  ఎంపీ ఎలక్షన్లో మెదక్ లో ఓట్ల లెక్కింపులో 2014లో పాల్గొన్నారు. కామా రెడ్డి అసెంబ్లీ ఎన్నికల 2018లో కౌంటింగ్ లో పాల్గొని ఇన్చార్జిగా వ్యవహారించారు. 2019లో జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఇన్చార్జిగా వ్యవహారించారు.

2020లో దుబ్బాక అసెంబ్లీ ఎన్నికలలో ఇన్చార్జిగా పాల్గొన్నారు. 2021లో జిహెచ్‌ఎ ంసి గౌతమ్ నగర్ 141వ డివిజన్ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2021లో నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జిగా వ్యవ హరించిన నీలం చిన్న రాజులు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యునిగా పని చేశారు. అంచ లంచెలుగా పార్టీ కోసం పని చేసిన నీలం చిన్న రాజులు పార్టీ గుర్తించి జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టింది.

ఈ సందర్భంగా సోమవారం జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన నీలం చిన్న రాజులు విజయక్రాంతి ప్రతి నిధితో మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ పటిష్ట వంతానికి కృషి చేస్తానని తెలిపారు. సీనియర్ నాయకులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సంద ర్భంగా పలువురు యూత్ నాయకులు నీలం చిన్న రాజులను సన్మానించి అభినం దించారు.  కార్యక్రమంలో బిజెపి యూత్ నాయకులు రజినీకాంత్ రావు, రాజు పాటి ల్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడు రవీందర్ రావు  పాల్గొన్నారు.